Share News

India vs Pakistan: హరిస్ రవూఫ్, ఫర్హాన్‌పై చర్యలు తీసుకోండి.. ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు..

ABN , Publish Date - Sep 25 , 2025 | 09:06 AM

ప్రస్తుత ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో ఆట కంటే మైదానంలో జరిగిన డ్రామానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తొలి మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం ఉద్రిక్తతలు సృష్టించింది.

India vs Pakistan: హరిస్ రవూఫ్, ఫర్హాన్‌పై చర్యలు తీసుకోండి.. ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు..
Sahibzada Farhan, Haris Rauf

ప్రస్తుత ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో ఆట కంటే మైదానంలో జరిగిన డ్రామానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తొలి మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం ఉద్రిక్తతలు సృష్టించింది. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో భారత్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan), హరిస్ రవూఫ్ (Haris Rauf) అవమానకర ప్రవర్తనకు పాల్పడ్డారు.


ఈ ఇద్దరు ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. మైదానంలోని ఫర్హాన్, హరిస్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది (BCCI complaint). ఐసీసీ నియమావళి ప్రకారం.. ఈ ఫిర్యాదుకు ఫర్హాన్, హరిస్ లిఖితపూర్వకంగా జవాబివ్వాల్సి ఉంటుంది. వారు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వారు తమ చర్యలను సమర్థించుకోలేకపోతే, నిషేధాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. బీసీసీఐ ఫిర్యాదుకు ప్రతిస్పందనగా పీసీబీ కూడా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది (cricket controversy).


సెప్టెంబర్ 14 మ్యాచ్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది (cricket discipline). అయితే, ఐసీసీ రూల్ ప్రకారం ఎవరైనా ఆటగాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. ఘటన జరిగిన ఏడు రోజుల్లోపు ఫిర్యాదు చేయాలి. కాబట్టి పీసీబీ ఫిర్యాదును ఐసీసీ తిరస్కరించవచ్చు. సూపర్-4 మ్యాచ్‌లో హరిస్ రవూఫ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 6-0 అంటూ సంజ్ఞలు చేశాడు. ఇక, ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను ఏకే 47లా పట్టుకుని బులెట్లు కాలుస్తున్నట్టు సెలబ్రేట్ చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..


ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2025 | 09:06 AM