UK dog attack: పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..
ABN , Publish Date - Sep 25 , 2025 | 08:44 AM
బ్రిటన్‌లో దారుణం జరిగింది. ప్రేమగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క తీరని శోకాన్ని మిగిల్చింది. నార్త్ యార్క్‌షైర్‌లోని ఈస్ట్ హెస్లర్టన్‌లో ఓ పెంపుడు కుక్క పదేళ్ల బాలికను పొట్టన పెట్టుకుంది
బ్రిటన్‌లో దారుణం జరిగింది. ప్రేమగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క తీరని శోకాన్ని మిగిల్చింది. నార్త్ యార్క్‌షైర్‌లోని ఈస్ట్ హెస్లర్టన్‌లో ఓ పెంపుడు కుక్క పదేళ్ల బాలికను పొట్టన పెట్టుకుంది (XL Bully attack). సవన్నా బెంథం అనే 10 ఏళ్ల బాలిక ఎక్స్‌ఎల్ బుల్లీ డాగ్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. సవన్నా తన పెంపుడు కుక్క బిగ్గీతో ఒంటరిగా టెలివిజన్ చూస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సవన్నాపై ఆ కుక్క దాడి చేసింది (XL Bully kills child). ఆ సమయంలో సవన్నా తల్లి గ్యాస్ క్యానిస్టర్ కనెక్షన్ రిపేర్ కోసం వెళ్లింది. సవన్నా తండ్రి వేరే పనిలో ఉన్నాడు. ఆమె తల్లి తిరిగి వచ్చేసరికి, సవన్నా నేలపై తీవ్ర గాయాలతో పడి ఉంది. పక్కనే కుక్క రక్తంతో తడిసి ఉండటం కనిపించింది. వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేశారు. అయితే సవన్నా మెడకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది (10-year-old killed by dog).
యూకే డేంజరస్ డాగ్ చట్టాల ప్రకారం ఎక్స్‌ఎల్ బుల్లీ డాగ్‌లను నిషేధించారు (banned breed). అయితే సవన్నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అన్ని నియమాలను పాటించి ఆ కుక్కను పెంచుకుంటున్నారు. తమ పెంపుడు కుక్కను నమోదు చేయడం, దానిని శుద్ధి చేయడం, మైక్రోచిప్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఆ కుక్కకు మాస్క్ వేయడం వంటి అన్ని చట్టపరమైన పనులను చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కుక్క సవన్నాపై ప్రాణాంతకంగా దాడి చేసింది. ఆ ఘటన తర్వాత ఆ కుక్కను చంపేశారు.
ఇవి కూడా చదవండి..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..