Share News

India vs Pakistan 2025: మరికాసేపట్లో పాక్‌తో మ్యాచ్.. వాళ్లిద్దరూ తిరిగి వచ్చినట్టేనా..?

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:35 PM

మరికాసేపట్లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్‌ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ లెవెన్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

India vs Pakistan 2025: మరికాసేపట్లో పాక్‌తో మ్యాచ్.. వాళ్లిద్దరూ తిరిగి వచ్చినట్టేనా..?
India vs Pakistan 2025 playing 11

మరికాసేపట్లో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్‌ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది (India vs Pakistan). ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ లెవెన్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రాబోతున్నట్టు సమాచారం. ఒమన్‌తో మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను తప్పించబోతున్నట్టు తెలుస్తోంది (India vs Pakistan 2025 playing 11).


డేంజరస్ ప్లేయర్స్ అయిన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవన్‌లోకి తిరిగి రావడం టీమిండియాకు మరింత బలాన్ని చూకూరుస్తుంది (IND vs PAK lineup). అయితే ఒకే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాతోనే బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. తిలక్ వర్మ 4వ స్థానంలోనూ, సంజు శాంసన్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు ( Jasprit Bumrah playing XI).


ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా 6, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు (India vs Pakistan squad today). అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలర్లుగా తుది జట్టులో ఉంటారు. దీంతో ఒకే ఒక ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా ఉంటాడు. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా పేస్ బౌలింగ్ చేస్తుండడం టీమిండియాకు కలిసొస్తోంది.

టీమిండియా తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 05:35 PM