Abhishek Sharma: అభిషేక్ విజయం వెనుక యువరాజ్‌ది కీలక పాత్ర.. అభిషేక్ తండ్రి ప్రశంసలు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:26 AM
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు చేసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు.
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు చేసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు. అతని విధ్వంసక ఇన్నింగ్స్ లక్ష్యాన్ని సులభంగా చేధించేందుకు దోహదపడింది. అభిషేక్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతడి తండ్రి రాజ్‌కుమార్ శర్మ (Abhishek Sharma father) స్పందించారు.
'అభిషేక్‌కు సహజసిద్ధంగానే టైమింగ్, పవర్ ఉంది. వాటికి కావాల్సిన డైరెక్షన్‌ను యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అందించాడు. అభిషేక్‌కు యువరాజ్ గురువు. తన అనుభవాలను అభిషేక్‌తో పంచుకునేవాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకోవాలనే సూత్రాన్ని తరచుగా చెబుతుండేవాడు. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా, జట్టు కోసం ఆడాలని సూచించేవాడు. యువీ మార్గదర్శకత్వంలోనే అభిషేక్ ఉత్తమ క్రికెటర్‌గా ఎదిగాడు' అని రాజ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు (Yuvraj Singh mentor).
అలాగే శుభ్‌మన్ గిల్‌తో అభిషేక్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, వారిద్దరి మధ్య సోదరభావం ఉందని రాజ్‌కుమార్ శర్మ తెలిపారు (Abhishek Gill Friendship). వారిద్దరూ పదేళ్ల వయసు నుంచి కలిసి ఆడుతున్నారని, ఒకరి బలాబలాల గురించి మరొకరికి తెలుసని అన్నారు. చిన్నవయసులో వారిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసే వారని, దేశం కోసం మ్యాచ్‌లు ఎలా గెలవాలో వారికి తెలుసని పేర్కొన్నారు. వారిద్దరూ ఇలాంటి ఎన్నో ఉత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..