Share News

Imran Khan roast: అలా అయితేనే పాకిస్థాన్ జట్టు గెలవగలదు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 09:52 AM

ఆసియా కప్‌లో వరుసగా రెండు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు కోపంతో మండిపోతున్నారు. పాక్ ఓటములపై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు.

Imran Khan roast: అలా అయితేనే పాకిస్థాన్ జట్టు గెలవగలదు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..
Imran Khan cricket comments

ఆసియా కప్‌లో వరుసగా రెండు సార్లు టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Pakistan vs India). ఆ జట్టు అభిమానులు, మాజీ ఆటగాళ్లు కోపంతో మండిపోతున్నారు. పాక్ ఓటములపై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కూడా స్పందించారు. పాకిస్థాన్ గెలవాలంటే ఏం చేయాలో చెబుతూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సోమవారం వెల్లడించారు.


'ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ వరుసగా రెండు సార్లు ఓడిపోవడం గురించి నా సోదరుడికి చెప్పాను. భారత్‌పై పాకిస్థాన్ గెలవాలంటే.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ఓపెనర్లుగా బరిలోకి దిగి, అంపైర్లనందరినీ మనవాళ్లను పెట్టుకోవాలని ఇమ్రాన్ అన్నారు. అసమర్థత, బంధుప్రీతితో పాకిస్థాన్ క్రికెట్‌ను నఖ్వీ నాశనం చేశాడని ఇమ్రాన్ బాధపడ్డారు. పాక్ ఆడుతున్న తీరు చూస్తే చాలా అవమానకరంగా ఉంది' అని అలీమా ఖాన్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు (Imran Khan cricket comments).


పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో ఉన్నారు (Pakistan cricket politics). 2023 ఆగస్ట్ నెలలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ బెయిల్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు.


ఇవి కూడా చదవండి..

మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..


ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్

మరిన్ని క్రీడావార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2025 | 09:52 AM