Home » IMD
భాగ్యనగరవాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడనున్నాయి. ఈనెలలో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నది.
రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి.
ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్‌లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది.
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీఎస్‌డీఎంఏ కార్యాలయాన్ని ఎన్డీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సందర్శించింది.
ఎల్‌నినో కారణంగా జూన్‌లో ముఖం చాటేసిన వానలు అనూహ్యంగా జులైలో పుంజుకున్నాయి. అయితే, ఆగస్టులో మాత్రం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది.
తీవ్ర వాయుగుండం వచ్చినా.. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావం ఏర్పడింది.
వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.