Share News

రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మూడు రోజుల్లో తొలకరి జల్లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 02:56 PM

ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపనాలు ఈరోజు(శనివారం) ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మూడు రోజుల్లో తొలకరి జల్లు
AP Monsoon

అమరావతి, జూన్ 6: ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకారం.. నైరుతి రుతుపనాలు ఈరోజు(శనివారం) ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని ఉందని తెలిపింది. మూడు రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకడంతో అక్కడ వాతావరణం చల్లగా మారిపోయింది.


గత సంవత్సరం మే 26న ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. సాధరణ సమయం కంటే ఈ సంవత్సరం రుతుపవనాలు కొంత ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సాధారణంగా లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ఇది మంచి సంకేతంగా అన్నదాతలు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆర్గానిక్ కూరగాయలు ఆరోగ్య రక్షణకు మేలు: మంత్రి సవిత

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 03:22 PM