Share News

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:43 PM

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం నాడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో సంవృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు.

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
Pemmasani Chandrasekhar

గుంటూరు, జూన్ 6: 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం నాడు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో సంవృద్ధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సంవృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంవృద్ధి కేంద్రం ద్వారా పౌరసేవలు, డిజిటల్ సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారత దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే వారికి అందిస్తున్న సేవలు ప్రజలకు చేరువులో ఉండాలని సూచించారు.


‘కేంద్రం ఒక్కటి... సేవలు అనేకం’ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. సంవృద్ధి గ్రామ కేంద్రంగా నారాకోడూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఎక్కడికీ వెళ్లకుండా ఈ కేంద్రంలో అన్ని సేవలు అందుతాయని అన్నారు. దాదాపుగా 60 టెస్టులు కేంద్రంలో పది నిమిషాల్లో చూస్తారన్నారు. డ్వాక్రా మహిళలకు ఎలా వ్యాపారం చేయాలో నేర్పిస్తారని అన్నారు. పోస్ట్ ఆఫీసు సేవలు ఉంటాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం కోసం, భూమి సారం కోసం టెస్ట్‌లు చేస్తున్నారన్నారు. పంట పొలాలకు ఎరువు చల్లే విధంగా డ్రోన్ ఏర్పాటు చేశామన్నారు. నారాకోడూరు గ్రామంలో ఉన్న సంవృద్ధి కేంద్రం దేశంలో నంబర్ వన్‌‌గా నిలవాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.


ప్రజలకు సేవ చేయడమే మా కులం: ధూళిపాళ్ల

సంవృద్ధి గ్రామ కేంద్రాన్ని నారాకోడూరు గ్రామంలో పెట్టినందుకు కేంద్రానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క కేంద్రంలో అనేక సౌకర్యాలు ఉన్నాయన్నారు. నారాకోడూరు గ్రామంలో ఉన్న పిల్లలను రోజుకి గంట సమయం ఈ కేంద్రంలో గడిపేలా తల్లిదండ్రులు చూసుకోవాలని.. దీని ద్వారా వారి భవిష్యత్తు మెరుగుపడుతుందని వెల్లడించారు. నారాకోడూరు గ్రామంలో ప్రతి ఇంటికి వైఫై సదుపాయం కల్పిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి పని చేస్తోందన్నారు. ‘మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తాం. మాకు కులం లేదు, మా కులం ప్రజలకు సేవ చేయడమే’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్

ఆర్గానిక్ కూరగాయలు ఆరోగ్య రక్షణకు మేలు: మంత్రి సవిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 02:08 PM