Share News

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:12 PM

రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతామని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, జూన్ 6: రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతామని స్పష్టం చేశారు. హైడ్రా..పేదల కాలనీల్లో దాడులు చేసి ఆ భూములను పెద్దలకు అప్పగిస్తోందని మండిపడ్డారు. శ్రీఆదిత్య కంపెనీ రివర్ బె‌డ్‌పైన ప్రాజెక్టు కడుతోందని.. ఆ కంపెనీ వెనుక ఓ ఎంపీ ఉన్నారన్నారు. శ్రీ ఆదిత్య కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారని.. దాన్ని ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.


సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదని కవిత విమర్శించారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఏపీ సీఎం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో మాట్లాడి 200 టీఎంసీల నీళ్లు తెచ్చి ఆ తర్వాత బనకచర్ల గురించి మాట్లాడాలన్నారు. అప్పుడు కేటీఆర్ పాలన నడిచిందని.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే నడుస్తోందన్నారు. అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు.. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ సవాళ్లతో ఒరిగేదేమీ లేదని కవిత విమర్శించారు.


తెలంగాణ బరాబర్ ప్రజల జాగీరే అని.. పవన్ కల్యాణ్ జాగీర్ కాదని కవిత స్పష్టం చేశారు. ఆంధ్రా విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామన్నారు. ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్‌కు మద్దతు ఇస్తే నాలుగు ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న 8 సీట్లు పోతాయన్నారు. పవన్ కల్యాణ్ 10 ఎకరాలు శిఖం భూమిని కొనుగోలు చేశారని.. కోడికుంట సర్వే నంబర్ 706లో శిఖం భూమి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయని.. ఆ భూమిని పవన్ తిరిగి ఇచ్చేయాలన్నారు. శిఖం భూమిలో వేసిన కంచెను పవన్ తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

సడన్‌‌గా నిలిచిన సింగపూర్ ఇండిగో.. విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ

నార్సింగి పీఎస్‌కు బ్రహ్మనాయుడు తరలింపు.. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 12:25 PM