Share News

సడన్‌‌గా నిలిచిన ఇండిగో విమానం.. ఫ్లైట్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:17 AM

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్‌వేపైనే ఆగిపోయింది.

సడన్‌‌గా నిలిచిన ఇండిగో విమానం.. ఫ్లైట్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ
Vijayawada Airport

కృష్ణా జిల్లా, జూన్ 6: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్‌వేపైనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈరోజు(శనివారం) ఉదయం 9:40 గంటలకు ఇండిగో విమానం సింగపూర్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే టేకాఫ్‌కు సిద్ధమై రన్‌వేపైకి వచ్చిన తర్వాత సాంకేతిక లోపం బయటపడటంతో విమానం నిలిచిపోయింది.


ప్రయాణికులు విమానంలోనే గంటల తరబడి కూర్చుని ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులతో పాటు ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే కుటుంబం సహా మిగిలిన ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కరించి విమానాన్ని బయలుదేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ..

యువకుడిని కారుతో ఢీకొట్టిన మహిళ.. ఆపై తన భర్త పోలీస్ అంటూ బెదిరింపులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 11:49 AM