నార్సింగి పీఎస్‌కు బ్రహ్మనాయుడు తరలింపు.. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:36 AM
భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడులోని కాంచీపురం నుంచి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 6: గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడులోని కాంచీపురం నుంచి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాంచీపురం నుంచి రోడ్డు మార్గం గుండా నార్సింగికి పోలీసులు తీసుకొస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బ్రాహ్మనాయుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచునున్నారు. భూకబ్జా కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మనాయుడి అరెస్ట్‌తో ఆ సంఖ్య ఆరుకు చేరింది. మాజీ ఎమ్మెల్యేను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారన్న సమాచారంతో పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో వినుకొండ వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. నిన్ననే బ్రహ్మనాయుడిని కాంచీపురంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడ స్థానికంగా ఉన్న కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం నార్సింగి పీఎస్‌కు తరలిస్తున్నారు.
గండిపేటలోని సర్వేనెంబర్ 18లో సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో తొమ్మిది ఎకరాలకు పైగా కాజేసేందుకు నిమ్మల కుటుంబసభ్యులు కుట్రపన్నారు. అందుకోసం నకిలీ జీవోలు, నకిలీ పత్రాలను సృష్టించడంలో మధ్యవర్తి రాధాకృష్ణకు బ్రహ్మనాయుడు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కలిసి ఈ కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఆయనపై సైబరాబాద్ పోలీసులు నిఘా ఉంచారు. కొంతకాలం బెంగళూరులో ఉన్న బ్రహ్మనాయుడు అక్కడి నుంచి కేరళకు వెళ్లి ఆపై తమిళనాడులోని కాంచీపురంకు వెళ్లారు. బ్రహ్మనాయుడు కాంచీపురంలో ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే నార్సింగి పోలీసుల బృందం, ఈవోడబ్ల్యూకు సంబంధించిన మరో బృందం అక్కడకు చేరుకుని మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
యువకుడిని కారుతో ఢీకొట్టిన మహిళ.. ఆపై తన భర్త పోలీస్ అంటూ బెదిరింపులు..
సడన్‌గా నిలిచిన సింగపూర్ ఇండిగో.. విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ
Read Latest Telangana News And Telugu News