Home » ICC
టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ తాజా వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 131 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ స్టార్ మహిళా టీ20 బ్యాటర్ స్మృతి మంధాన మరింత కిందకి వెళ్లింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఒక స్థానం కోల్పోయిన స్మృతి.. 747 పాయింట్లతో ఐదో ర్యాంకు సాధించింది.
దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్‌లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.
పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి గుడ్‌బై చెప్పేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు.
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళలు దూసుకెళ్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. యువ ప్లేయర్ షెఫాలీ వర్మ టాప్ 5లోకి అడుగుపెట్టడానికి అత్యంత చేరువలో ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్ 10కి అడుగు దూరంలో ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసి నెలన్నర రోజులు దాటినప్పటికీ ఓ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ దృష్టి పడింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ప్రకటించింది. స్టార్ పేసర్ బుమ్రాను వెనక్కి నెట్టి ఈ అవార్డును సంజు శాంసన్ దక్కించుకున్నాడు.
మహిళల క్రికెట్ చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 5 వరకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది.