Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:21 PM

మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని 652 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకింది. మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 635 పాయింట్లతో 12వ స్థానంలోనే ఉంది.


తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 6 బ్యాటర్ల స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. స్మృతి తర్వాతి స్థానంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ(749), ఆసీస్ బ్యాటర్ ఆష్లీ గార్డ్‌నర్(724), ఇంగ్లండ్ ప్లేయర్ నాట్‌సీవర్ బ్రంట్(714), ఆసీస్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్(674) పాయింట్లతో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్‌ బౌలర్ అలానా కింగ్ 775 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సోఫీ ఎకిల్‌స్టన్(747), ఆష్లీ గార్డ్‌నర్(713) ఉన్నారు. టీమిండియా స్టార్ దీప్తి శర్మ 614 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతోంది.


టీ20 ఫార్మాట్‌లో..

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ జాబితాలో ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ 787 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ స్మృతి మంధాన(770), హెలీ మ్యాథ్యూస్(765) తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. బౌలింగ్ విభాగంలో టాప్ 8 స్థానాలు పదిలంగా ఉన్నాయి. అగ్రస్థానంలో పాక్ పేసర్ సాదియా ఇక్బాల్(743) ఉంది. కాగా టీమిండియా బౌలర్ అరుంధతీ రెడ్డి 697 పాయింట్లతో పదో స్థానానికి ఎగబాకింది.


ఇవి కూడా చదవండి:

‘సన్‌రైజర్స్’ వివాదం.. రంగంలోకి దిగిన లలిత్ మోదీ!

పాక్ దాడుల గురించి భారత్‌తో చర్చించాలనుకుంటున్నాం: అఫ్గాన్ క్రికెటర్

Updated Date - Mar 18 , 2026 | 12:22 PM