‘సన్‌రైజర్స్’ వివాదం.. రంగంలోకి దిగిన లలిత్ మోదీ!
ABN , Publish Date - Mar 18 , 2026 | 10:41 AM
విదేశీ లీగ్ ‘ది హండ్రెడ్’ వేలంలో పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ ఈ విషయంపై స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ లీగ్ ‘ది హండ్రెడ్’ వేలంలో పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలంటూ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. ఐపీఎల్ ఆరంభానికి ముందు ఈ వివాదం తీవ్ర చర్చకు దారి తీసింది. పలువురు మాజీ క్రికెటర్లు కూడా దీనిపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
‘ది హండ్రెడ్ లీగ్ వేలంలో భాగంగా పాక్ ప్లేయర్ అబ్రార్‌ను రూ.2.34 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ విషయంపై అభిమానులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో రాజకీయ జోక్యం ఉండకూడదు. స్వదేశంలో ఐపీఎల్ లాంటి టోర్నీల్లో పాక్ ప్లేయర్లను భారత్ తీసుకోవడం లేదు.. కానీ ‘ది హండ్రెడ్’ అనేది విదేశీ లీగ్. అక్కడ పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంలో తప్పేమీ లేదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. కాల్ మీ’ అని ఎక్స్‌లో లలిత్ మోదీ పేర్కొన్నారు. వివాదంలో ఉన్న కావ్యా మారన్‌కు మద్దతుగా, ఆమెకు సాయం చేయడానికే ఆయన ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా లలిత్ మోదీ 2010లో ఐపీఎల్‌కు సంబంధించిన ఆర్థిక అక్రమాల ఆరోపణల నేపథ్యంలో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం యూకేలో ఉంటున్నారు. ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకలు, భారీ కిక్ బ్యాక్ ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. అయితే తాజా వ్యాఖ్యలతో ఆయన మళ్లీ వార్తల్లోకి రావడం వల్ల సన్‌రైజర్స్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ మరింత ముదిరేలా చేసింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: నిలకడ విషయంలో సూర్య మెరుగుపడాలి: మహేల జయవర్దనే
క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ అక్తర్!