ఐపీఎల్ 2026: నిలకడ విషయంలో సూర్య మెరుగుపడాలి: మహేల జయవర్దనే
ABN , Publish Date - Mar 18 , 2026 | 07:20 AM
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్దనే పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, బుమ్రా వంటి ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్దనే పంచుకున్నాడు.
‘శిక్షణ శిబిరం తొలి రోజే రోహిత్ శర్మ మాతో చేరాడు. నెట్స్‌లో చాలా బాగా ఆడాడు. రోహిత్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. మరింత ఫిట్‌గా తయారయ్యాడు. ఐపీఎల్‌లో అతడు చెలరేగుతాడని ఆశిస్తున్నా. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ విషయంలో నేనెప్పుడూ ఆందోళన పడలేదు. జట్టుకు అవసరం అయినప్పుడు సూర్య కచ్చితంగా అద్బుత ప్రదర్శన కనుబరుస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అతడు నిలకడ విషయంలో మాత్రం కాస్త మెరుగుపడాల్సి ఉంది. సూర్య కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడనే అనుకుంటున్నా. కానీ టీ20 కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. కాస్త విశ్రాంతి తీసుకున్నాక సూర్య శిబిరంలో చేరుతాడు. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవడం, పురుషుల జట్టు టీ20 వరల్డ్ కప్ నెగ్గడం ఓ తరానికి ప్రేరణనిచ్చిందనడంలో సందేహం లేదు. టీమిండియాలోని కీలక ప్లేయర్లు ఎంఐలో ఉండటం గర్వంగా ఉంది’ అని మహేల జయవర్ధనే అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం