క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ అక్తర్!
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:36 AM
పాకిస్థాన్ స్టార్ పేసర్ అసద్ అక్తర్ వేసిన ఓ ఓవర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్ పేసర్ అసద్ అక్తర్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్ వేశాడు! దీంతో అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు ఏమైనా పాల్పడ్డాడా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ పేసర్ అసద్ అక్తర్ వేసిన ఓ ఓవర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్‌తో దేశవాళీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా మార్చి 14న కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్ జట్ల మధ్య పెషావర్‌లోని ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. పాక్ పేసర్ అసద్ అక్తర్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్ వేశాడు! దీంతో అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు ఏమైనా పాల్పడ్డాడా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ మ్యాచ్‌లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ తన బౌలింగ్‌లో భాగంగా పెద్ద నో బాల్ వేశాడు. క్రీజు లైన్ నుంచి చాలా ముందుకు వెళ్లి బంతిని సంధించాడు. అతడు ఆ ఓవర్లో 21 పరుగులిచ్చాడు. రెండు వైడ్లు, రెండు నో బాల్స్ వేశాడు. అయితే ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. అక్తర్ మరీ అంత పెద్ద నో బాల్ వేయడంతో స్పాట్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా? అని చర్చ నడుస్తోంది.
2010లో ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ నో బాల్ వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్తర్ వేసిన నో బాల్‌ను ఆ ఉదంతంతో పోలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో అసద్ అక్తర్ మరీ అంత పెద్ద నో బాల్ ఎందుకు వేశాడో కారణం మాత్రం తెలియదు.. కానీ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం