Share News

మెక్సికోలో అయితే ఆడతాం..

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:48 AM

పశ్చిమాసియాలో భీకరమైన యుద్ధం నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో ఇరాన్‌ పాల్గొంటుందా లేదా అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫిఫా ప్రపంచకప్‌ ఈ జూన్‌ 11 నుంచి అమెరికా, మెక్సికో, కెనడా...

మెక్సికోలో అయితే ఆడతాం..

మా మ్యాచ్‌లు అమెరికాలో వద్దు

ఫిఫాను కోరిన ఇరాన్‌ సాకర్‌ సమాఖ్య

మెక్సికో సిటీ: పశ్చిమాసియాలో భీకరమైన యుద్ధం నేపథ్యంలో ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో ఇరాన్‌ పాల్గొంటుందా లేదా అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫిఫా ప్రపంచకప్‌ ఈ జూన్‌ 11 నుంచి అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, వరల్డ్‌కప్‌ కోసం తమ దేశానికి వస్తే ఇరాన్‌కు భద్రత కల్పించలేమనీ, అందుకే ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగితే మంచిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఆడాల్సిన తమ మ్యాచ్‌లను మెక్సికోకు తరలించాలని ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా)ను ఇరాన్‌ సాకర్‌ సమాఖ్య కోరుతోంది. ఇరాన్‌ ప్రతిపాదనపై ఫిపా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా.. భారత్‌లో తాము ఆడలేమని, లంకకు తమ మ్యాచ్‌లు తరలించాని బంగ్లాదేశ్‌ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు ఐసీసీ ఒప్పుకోకపోవడంతో చివరకు బంగ్లా క్రికెట్‌ జట్టు ఏకంగా టోర్నీకే దూరమైంది. ఫిఫా కప్‌ షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌ దశ మ్యాచ్‌లను ఇరాన్‌ జట్టు జూన్‌ 16న న్యూజిలాండ్‌తో, 21న బెల్జియంతో, 26న ఈజిప్టుతో అమెరికాలో ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఇరాన్‌ అంశంపై బంతి ఫిఫా కోర్టులో ఉండడంతో, ప్రపంచ సమాఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:48 AM