రెజ్లర్ అంతిమ్‌కు ఝలక్
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:52 AM
స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన 53 కిలోల విభాగం ట్రయల్స్‌లో మీనాక్షి గోయత్ 6-2 తేడాతో అంతిమ్‌కు...
మీనాక్షికి ‘ఆసియా’ బెర్త్
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన 53 కిలోల విభాగం ట్రయల్స్‌లో మీనాక్షి గోయత్ 6-2 తేడాతో అంతిమ్‌కు షాక్ ఇచ్చింది. దీంతో వచ్చే నెల 6 నుంచి 11 వరకు కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో పాల్గొనే భారత మహిళల జట్టులో తను చోటు దక్కించుకుంది. గతంలో జరిగిన మూడు ట్రయల్స్‌లోనూ వరల్డ్ చాంపియన్‌షి్‌ప మెడలిస్ట్ అయిన అంతిమ్ చేతిలో ఓడిన మీనాక్షి ఈసారి మాత్రం చక్కటి డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. మరోవైపు 50 కిలోల విభాగంలో నీలమ్ బెర్త్ సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం