ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సత్తా చాటుతోంది: రికీ పాంటింగ్
ABN , Publish Date - Mar 18 , 2026 | 09:00 AM
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి, ఓవరాల్‌గా మూడుసార్లు పొట్టి ప్రపంచ కప్‌ను భారత జట్టు సగర్వంగా ముద్దాడి చరిత్ర సృష్టించింది. గ్రూప్ స్టేజిలో అజేయంగా నిలిచి సూపర్ 8కి చేరుకున్న టీమిండియా.. తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై ఓడింది. ఇలాంటి పరిస్థితుల్లో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్‌ను బరిలోకి దింపారు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.
‘ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపి, సంజు శాంసన్‌తో తిరిగి ఓపెనింగ్ చేయించడం చాలా పెద్ద నిర్ణయం. అది మంచి ఫలితాలనిచ్చింది. సంజు వల్లే టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది. ఒక ఆటగాడిగా, కోచ్‌గా, మాజీ కెప్టెన్‌గా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆటగాడి భుజాలపై చేతులు వేసి.. ‘చూడు మిత్రమా.. మేం నిన్ను నమ్ముతున్నాం. ఈ పాత్ర పోషించడానికి నువ్వే సరిపోతావు’ అని ధైర్యం చెప్పాలి. అప్పుడు ఏ ఆటగాడైనా తన మీద తాను నమ్మకం కోల్పోడు. అయితే కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కాదు.. వన్డేల్లోనూ టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో సత్తా చాటుతోంది’ అని రికీ పాంటింగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: నిలకడ విషయంలో సూర్య మెరుగుపడాలి: మహేల జయవర్దనే
క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ అక్తర్!