Home » HYDRA
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌ను కుంభవృష్టి వణికించింది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అలెర్ట్ చేశారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజల బయటకు రాకూడదని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అరికట్టి చరిత్రను కాపాడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
లే అవుట్‌లను ప్రామాణికంగా తీసుకొని పార్కులు, రోడ్లు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిని ఆక్రమించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు.
నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి.
మూసీని మూసేసి దర్జాగా దందా చేస్తున్న అక్రమార్కులకు హైడ్రా చెక్ పెట్టింది. నదిని వ్యర్థాలతో నింపి నిర్మించిన ఆక్రమణలను తొలగించింది.
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.