Hyderabad Rains: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:45 PM
హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని IMD ప్రకారం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అనేక జిల్లాల్లో ఆరంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు.

అయితే నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రి తర్వాత భారీ వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కొనసాగవచ్చు. అదేవిధంగా జగిత్యాల, సిద్దిపేటలోనూ ఈ రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్ వంటి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. అయితే తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి