Home » Hyderabad
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.
ఆన్లైన్లో మరో పైరసీ భూతం ప్రత్యక్షమైంది. ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు కనపడుతుండటం కలకలం రేపుతోంది.
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్ర్తాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు అతడిపై పది సెక్షన్ల కేసు నమోదు చేయగా.. తాజాగా మరో మూడు సెక్షన్లు జోడించారు.
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం లిఫ్ట్ పాడైపోయి అవస్థలు పడిన అధికారులు, ఉద్యోగులు తాజాగా పది రోజులుగా నీటి సరఫరా కరువై సతమతమవుతున్నారు.
జలమండలి అధికారి పేరిట ఓ సైబర్ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్మండికి చెందిన రిటైర్డ్ ప్రభుతోద్యోగికి వాటర్ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్ చేశాడు.