తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్.. వాతావరణ శాఖ అంచనాలు ఇవే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 07:11 AM
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్-నినో పరిస్థితుల కారణంగా 2026 వేసవి సీజన్‌లో సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా చలి ప్రభావం బాగా తగ్గుతోంది. కొంచెం కొంచెంగా భానుడి ప్రభావం పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం పొడి వాతావరణం కొసాగుతోంది. తెల్లవారుజామున కాస్త చలిగా అనిపించినా.. మధ్యాహ్నం భానుడు భగ్గుమంటున్నాడు. భారత వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఫిబ్రవరి నెల పూర్తయ్యే నాటికి చలి వాతావరణం పూర్తిగా తగ్గనుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు దారుణ స్థాయిలకు చేరుకోనున్నాయి.
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పసిఫిక్‌లో ఏర్పడుతున్న ఎల్-నినో పరిస్థితుల కారణంగా 2026 వేసవి సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మార్చి-జూన్ మధ్య దేశంలోని పలు రాష్ట్రాలలో ముందెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ వెదర్ అప్‌డేట్..
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ రోజు.. ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుంది. మధ్యాహ్నం సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం చలి వాతావరణం కొనసాగనుంది. రేపు.. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. పగటిపూట సాధారణ ఎండ ఉన్నప్పటికీ.. సాయంత్రం, రాత్రి వేళల్లో చలి ప్రభావం స్వల్పంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..