Home » Hyderabad City Police
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు.
తెలంగాణలో 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం నుంచి వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.