Kukatpally Girl Case: మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిని కస్టడీకి కోరుతూ పిటిషన్..
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:31 AM
ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన కూకట్‌పల్లి మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు చిక్కుముడులు విప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసుల చెబుతున్నారు. ఈ మేరకు సహస్ర కేసులో నిందితుడిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. నిందితుడు ఓ కుందేలును పెంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర హత్య జరిగిన రోజే కుందేలు కూడా చనిపోయిందని విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. సహస్ర హత్య చేసిన తర్వాత కుందేలుకు అనారోగ్యంగా ఉందని నిందితుడు హడావిడి చేసినట్లు చెప్పారు.
అయితే ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు. గతంలో నిందితున్ని తోటి విద్యార్థులు బాడీ షేమింగ్ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒంటరిగా ఉంటూ యూట్యూబ్లో క్రైమ్ స్టోరీస్, వెబ్ సిరీస్ చూస్తుండేవాడిని నిర్ధారించినట్లు చెప్పారు. అతని వద్దకు స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చింది..? అందుకు అవసరమైన డబ్బులు ఎవరిచ్చారు..? ఎక్కడైనా చోరీలు చేశాడనే కోణంలో దర్యాప్తు చేయడానికి పోలీసులు నిందితుడిని కస్టడీకి కోరుతున్నట్లు వెల్లడించారు.
కూకట్‌పల్లిలో ఇటీవల 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లిన పద్నాలుగేళ్ల పక్కింటి బాలుడే ఆ బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆధారాలతో సహా.. నిర్థారించి నిందితున్ని జువైనల్ హోమ్‌కు తరలించారు. కేవలం బ్యాట్‌కోసం చిన్నారిని అతి కిరాతకంగా బాలుడు హత్య చేయడం, 27 కత్తిపోట్లు పొడవడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు