Share News

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...

ABN , Publish Date - Aug 21 , 2025 | 10:25 AM

పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.

HYD Police News: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం...
Fake certificates

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌‌లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపాయి. 2022 నోటిఫికేషన్‌లో సెలెక్ట్ అయిన కానిస్టేబుళ్లు ఫేక్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో ఉద్యోగం కోసం స్థానికతను చూపించడానికి నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన 59 మందిలో 54 మంది కానిస్టేబుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని పేర్కొన్నారు. వారిపై సిసిఎస్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల శిక్షణను నిలిపివేసి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


అయితే.. నకిలీ సర్టిఫికెట్ల ప్రస్తావన మనం ఎక్కడో ఓ చోట చూస్తునే ఉంటాం.. కానీ పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Updated Date - Aug 21 , 2025 | 10:27 AM