Home » Heavy Rains
తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా.. 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
రానున్న భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ORR వరకు 889 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు.
తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
భాగ్యనగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులకు భారీ వర్షం ఉపశమనం కలిగించింది.
దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.