Home » Heavy Rains
భారీ వర్షంతో గుంటూరు, విజయవాడ నగరాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం..
వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన వాన సాయంత్రం వరకూ కొనసాగింది. భారీ వర్షాలకు మహా నగరం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది.
GHMC Alerted: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. అత్యవసర సేవలకోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బల్దియా కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వానతో వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయి..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు పొటెత్తుతుండటంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది.