GHMC Alerted: భారీ వర్ష సూచన.. ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్లకు కాల్ చేయండి..
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:34 PM
GHMC Alerted: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. అత్యవసర సేవలకోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బల్దియా కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. అత్యవసర సేవలకోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బల్దియా కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్‌కి వస్తున్న ఫిర్యాదుల వివరాలను కమిషనర్ తెలుసుకుంటున్నారు.
ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్స్
ఎన్డీఆర్ఎఫ్ : 8333068536
ఐసీసీసీ : 8712596106, 8712674000
హైడ్రా : 9154170992, 8712660600
హైడ్ ట్రాఫిక్ నియంత్రణ : 040-278524482
సైబర్‌బ్యాండ్ : 8500411111
రాచకొండ : 8712662999
డయల్ 100, 8712681241
టీజీఎస్‌పీడీసీఎల్ : 7901530966
ఆర్టీసీ : 9444097000
వరంగల్ కంట్రోల్ రూమ్ : 8712685048
108 ఈఎమ్‌ఆర్ఐ కంట్రోల్ రూమ్ : 9100799129
డీజీ కంట్రోల్ రూమ్ : 8712681251
హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ఎన్‌డబ్ల్యూ కంట్రోల్ రూమ్ : 9949930003
ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ : 8712659607
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ : 8125971221
అగ్నిమాపక కంట్రోల్ రూమ్ : 9949991101
36 గంటలు భారీ వర్షాలు
నగరంలో ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఆగస్టు 13వ తేదీ (ఈ రోజు) సాయంత్రం నుంచి ఆగస్టు 14వ తేదీ( రేపు) సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది. 80 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించింది.
ఇవి కూడా చదవండి
విజయవాడలో వర్ష బీభత్సం.. ఇద్దరు మృతి
జెడ్పీటీసీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఆగ్రహం