Home » Heavy Rains
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది.
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులని తలిపిస్తున్నాయి.
హయత్‌నగర్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది.
మెదక్ పట్టణంతో పాటు రాజీపల్లిలో 9.5, పాతూరు 8.1 సెం. మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మంగళవారం తిరువణ్ణామలై, కళ్లకుర్చి, తేని, దిండుగల్, మదురై, శివగంగ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.