Heavy Rains: మధురైలో కుండపోత.. స్తంభించిన జనజీవనం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:29 AM
మదురైలో గురువారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. తల్లాకుళం, కోపుదూరు, మూండ్రుమావడి, కడచ్చనేందల్, ఒత్తకడై, మాట్టుతావని, అన్నానగర్, గోరీపాళయం, సింహక్కల్, పెరియార్ బస్టాండు తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
చెన్నై: మదురైలో గురువారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. తల్లాకుళం, కోపుదూరు, మూండ్రుమావడి, కడచ్చనేందల్, ఒత్తకడై, మాట్టుతావని, అన్నానగర్, గోరీపాళయం, సింహక్కల్, పెరియార్ బస్టాండు తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇదే విధంగా పశుమలై, తిరుప్పరంకుండ్రం,

తిరునగర్(Tirunagar), తనక్కన్‌కుళం, తిరుమంగళంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ విభాగం పోలీసులు వర్షం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మదురై ఎంపీ వెంకటేశన్ తన ఎక్స్‌పేజీలో ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News