Share News

CM Revanth Reddy: భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 11 , 2025 | 07:44 PM

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులని తలిపిస్తున్నాయి.

CM Revanth Reddy: భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. నగరంలో పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.


హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, ట్రాఫిక్, పోలీసు అధికారులు స‌మ‌న్వయం చేసుకుంటూ.. ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వర్టుల‌ పైనుంచి నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలకు గండిప‌డే ప్రమాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.


నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు చేరడంతో చెరువులను తలిపిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. హయత్‌‌నగర్‌‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Updated Date - Sep 12 , 2025 | 12:23 AM