Heavy rains: అతి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:09 PM
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలోని ఆదిలావాద్, మహమూబాబాద్, భద్రాత్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అదేవిధంగా శనివారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలీమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read:
AI Minister Diella: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మహిళా మంత్రి.. కారణమేంటో తెలిస్తే..
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు
For More Telangana News and Telugu News..