Adilabad Collectorate Office Collapse: భారీ వర్షానికి కూలిన కలెక్టరేట్ భవనం
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:29 PM
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి కలెక్టరేట్ భవనం కూలింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి కలెక్టరేట్ కార్యాలయంలోని ఓ పక్క గల పురాతన భవనం కూలింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ వెనుక భాగంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు.
కలెక్టరేట్ భవనం స్లాబ్ కూలిన నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇదే భవనంలో కలెక్టర్, ఆర్డీవో, ట్రెజరీ సహా పలు కార్యాలయాలు కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 84ఏళ్ల క్రితం నిర్మించిన భవనం, మొత్తం శిథిలా వస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. 15 ఏళ్ల నుంచి పెచ్చులు ఊడుతుండటంతో తాత్కాలిక మరమ్మతులతో వినియోగిస్తూ వచ్చారు. తాజాగా స్లాబ్ కూలడంతో విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు. కాగా, నిధుల కొరతతో మధ్య లోనే కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణం నిలిచి పోయినట్లు తెలుస్తోంది.
Also Read:
మీ ఫొటోను 3Dలోకి మార్చాలనుందా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
For More Latest News