Home » Heavy Rains
మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్‌లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
మహానగరాన్ని మరోసారి వరణుడు వణికించాడు. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం.. జంట జలాశయాల గేట్లు తెరిచారు.
బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు.
ముసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన మూసి ఉద్ధృతికి దెబ్బతిందన్న వార్తలు సోషిల్ మీడియాలో, మీడియా ఛానల్స్‌లో ప్రచురితం అయ్యాయి.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. రెండు జలాశయాలకు సంబంధించి 4 గేట్ల చొప్పున తెరిచారు. మూసీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి... వాటి నుంచి ఇంకా బయటపడక ముందే మరోసారి వానలు దంచికొడతాయన్న వార్తలు విని ఆ ప్రాంత ప్రజలు కంగారు పడిపోతున్న పరిస్థితి.
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షం నుంచే భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు.. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అంతలోనే వరణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు.