Hyderabad Flood Update: మూసీ ఉద్ధృతి.. నీట మునిగిన చాదర్‌ఘాట్, ముసరాంబాగ్..

ABN, Publish Date - Sep 27 , 2025 | 12:39 PM

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, ముసరాంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొత్త వంతెన సామగ్రి కొట్టుకుపోయింది. వరదల వల్ల పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పురానాపూల్ దగ్గర ఓ పూజారి వరదలో చిక్కుకుపోయాడు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. భారీ వరదల నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Updated at - Sep 27 , 2025 | 12:56 PM