Share News

Heavy Rains: మరో గంటలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

ABN , Publish Date - Sep 28 , 2025 | 07:25 PM

హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.

Heavy Rains: మరో గంటలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

హైదరాబాద్: నగరంలో మరో గంటలో భారీ వర్షం పడుతుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. సుమారు 2వేల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీటి మునిగిన విషయం తెలిసిందే.


బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం.. దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

గాంధీ హిల్‌కు పూర్వ వైభవం: ఎంపీ కేశినేని చిన్ని

For More TG News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 08:25 PM