Gandhi Hill In Vijayawada: గాంధీ హిల్‌కు పూర్వ వైభవం: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:57 PM
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో విజయవాడ ఉత్సవ్ పేరిట నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. వీటిని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా విజయవాడకు తరలివస్తున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 28: విజయవాడలోని గాంధీ హిల్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. ఆదివారం విజయవాడలోని గాంధీ హిల్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గాంధీ హిల్ అభివృద్ధి పనుల పురోగతిపై కమిటీ సభ్యులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ విలేకర్లతో మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీన గాంధీ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారని తెలిపారు.
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నక్షత్రశాలను పునర్నిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ అభివృద్ధిలో గాంధీ హిల్‌కు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. విజయవాడకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా గాంధీ హిల్ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గాంధీ హిల్ అభివృద్ధికి తన ఎంపీ నిధులను సైతం కేటాయిస్తానని స్పష్టం చేశారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గాంధీజీకి సంబంధించిన పూర్తి సమాచారంతో ఒక మ్యూజియంను సైతం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. గాంధీ హిల్స్ సర్వాంగ సుందరంగా అధికారులు తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ క్రమంలో విజయవాడ ఉత్సవ్ పేరిట నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. వీటిని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా విజయవాడకు తరలివస్తున్నారు. ఈ ఉత్సవ్ కార్యక్రమానికి రోజుకొక ప్రముఖుడు హాజరవుతున్నారు. ఇప్పటికే భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం.. దసరా ఉత్సవాలతోనే ముగియనున్నాయి. అంటే డిసెంబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం
మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
For More AP News And Telugu News