Share News

Tirumala Brahmotsavam: తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:35 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తిరుమాడ వీధులు, గ్యాలరీలు, కంపార్ట్‌మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. దాంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Brahmotsavam: తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల, సెప్టెంబర్ 28: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే.. తిరుమల్లోని రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, గ్యాలరీలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో కేవలం బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. అలాగే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాత్రం ద్విచక్ర వాహనాలకు మినహా అన్ని వాహనాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సులను మాత్రమే అనుమతి ఇస్తుండడంతో.. బస్సుల్లోకి ఎక్కేందుకు భక్తులు ఎగబడుతున్నారు.


సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదీకాక.. బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామి వారు.. వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఆ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వీక్షించేందుకు శనివారం రాత్రి నుంచి భక్తులు తిరుమాడ వీధుల్లో వేచి ఉన్నారు. ఇక శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేసుకొచ్చిన వాహనాలతో తిరుమల నిండిపోయింది. దీంతో తిరుమలకు వాహనాలు వెళ్లినా.. అక్కడ వాటిని నిలిపే పరిస్థితి అయితే లేదు. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో పర్యవేక్షణకు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక సిబ్బందిని టీటీడీ ఏర్పాటు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?

For More AP News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 03:45 PM