Encounter In Chhattisgarh - Odisha Border : మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:47 PM
భారీ ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దుల్లో ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
రాయపూర్, సెప్టెంబర్ 28: ఛత్తీస్‌గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా దుమార్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి ఆదివారం భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఈ వెంటనే భద్రతా దళాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి.
దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ముందుకు వెళ్లాయి. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అలాగే ఈ సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలను సైతం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కుంబింగ్ ఆపరేషన్‌ను భద్రతా దళాలు చేపట్టాయి.
2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మావోయిస్టుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దీంతో మావోయిస్టుల్లో పలువురు అగ్రనేతలు సైతం వివిధ సమయాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నెలకొరిగారు. అలాగే వందల మంది మావోయిస్టులు మరణించారు. ఇక పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాాజాగా ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 71 మంది మావోయిస్టులు.. ఒకే సారి రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో సైతం అడపాదడపా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?
For More National News And Telugu News