Home » Harish Rao
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్.. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డి సర్కారు....
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, త్వరలోనే అసలు నిజాలు బయటపడతాయని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
కేసీఆర్ స్థాయి.. రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని చెప్పుకొచ్చారు.
జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించలేదని ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు. కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని అన్నారు.
బీఆర్ఎస్‌లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.