MLA Harish Rao: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది..
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:41 PM
బీసీ రిజర్వేషన్‌లో కీలకమైన జీవోనెం.9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి హైకోర్టులో నిన్నటి నుంచి కొనసాగుతన్న వాదనలు ఇవాళ్టీతో ముగిసాయి.
హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై హైకోర్టు స్టే విధించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని ఆరోపించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ ఢిల్లీ నేతలతో పోరాటం చేయండి.. కలిసి రావడానికి బీఆర్ఎస్ సిద్ధమని హరీష్‌రావు తెలిపారు.
బీసీ రిజర్వేషన్‌లో కీలకమైన జీవోనెం.9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి హైకోర్టులో నిన్నటి నుంచి కొనసాగుతన్న వాదనలు ఇవాళ్టీతో ముగిసాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం జీవో నెం.9పై స్టే విధిచింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. జీవో నెం.9 స్టే నేపథ్యంలో బీఆర్ఎస్ బడా లీడర్లు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!