Share News

BRS Leaders House Arrest: చలో బస్ భవన్.. కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:18 AM

ఆర్టీసీ చార్జీలను పెంచడంపై బీఆర్ఎస్ ఇచ్చిన 'చలో బస్‌ భవన్‌’ పిలుపు మేరకు నిరసనకు బయల్దేరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

BRS Leaders House Arrest: చలో బస్ భవన్..  కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్
BRS leaders house arrest

ఆర్టీసీ చార్జీలను పెంచడంపై బీఆర్ఎస్ ఇచ్చిన 'చలో బస్‌ భవన్‌’ పిలుపు మేరకు నిరసనకు బయల్దేరిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ చార్జీల పెంపుపై కేటీఆర్ మండిపడ్డారు. తనతోపాటు ఇతర నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని తమ పార్టీ పిలుపునిచ్చిందని, పోలీసులు తమను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.


ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారని మండిపడ్డారు. మాపై పోలీసులకు ఉన్న ఉత్సాహం హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల కుట్రలు చేసినా ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే వరకు బీఆర్ఎస్ తరఫున తమ నిరసన తెలుపుతూనే ఉంటామని చెప్పారు. ఇలాంటి పోలీసు నిర్బంధాలు తముకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు.


అటు బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Hareesh Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుపేదల నడ్డి విరుస్తూ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసనగా బయల్దేరితే తమ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 'బీఆర్ఎస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనం. అరెస్టు చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. 20 నెలల పాలనలో 5 సార్లు బస్సు చార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తలకు, విద్యార్థలుకు టికెట్ డబుల్ చేశారు. ఇప్పటికే జీవో నెంబర్. 53, 54‌లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారు. ఇలా వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు. నగరానికి తలమానికంగా ఉన్న మెట్రో రైలును రేవంత్ సర్కార్ ఆగం చేసింది. కాంగ్రెస్ పాలనలో తాము శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?' అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 11:18 AM