Home » Guntakal
మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.
మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.
పట్టణంలోని గంగా నగర్, హనుమేష్ నగర్‌లో శనివారం కలెక్టర్ ఒ. ఆనంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్యకంగా కలిశారు.
బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యాపారా లు సాగిస్తున్న చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో తాడిపత్రి టౌనబ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని సంకల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో చర్చించామన్నారు. ఆయన శనివారం పట్టణంలోని మార్కెట్‌యార్డు నుంచి బస్టాండ్ వరకు మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చిరువ్యాపారుల తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై వారికి అవగాహన కల్పించారు.
మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన మహమ్మద్ ఫరూక్ ఆదేశాల మేరకు రూపొందించిన ఆవో ఉర్దూ సిఖో పుస్తకాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి గురువారం పట్టణంలోని తమన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులకు మంచి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాల న్నారు.
ప్రజలు, రైతుల నుంచి వచ్చిన అర్జీలపైన తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్ స్థానిక అధికారులను ఆదేశించారు. వజ్రకరూరు మండ లంలోని రాగులపాడు గ్రామంలో గురువారం ‘ఒక నెల - ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ అనే కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.