Share News

MEO: ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు భరోసా: ఎంఈవోలు

ABN , Publish Date - May 21 , 2026 | 11:59 PM

ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

MEO: ప్రభుత్వ బడుల్లోనే భవిష్యత్తుకు భరోసా: ఎంఈవోలు
Teachers educating parents in Kariganapally

కుందుర్పి, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎంఈవోల తో పాటు ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది, పాఠశాల కమిటీ అధ్య క్షుడు, సభ్యులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేం దుకు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు.

శెట్టూరు: మండలపరిధిలోని యాదవపురంలో ప్రవేటు పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమాన్ని మండల వి ద్యాధికారులు శ్రీధర్‌, వాణిదేవి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఎంఈఓలతో పాటు సీఆర్పీలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంపీడీవో జిలానీ బాషా విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించారు. 40 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు వారు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 11:59 PM