Share News

TDP: మహానాడు నిర్వహణపై సమావేశం

ABN , Publish Date - May 24 , 2026 | 12:16 AM

మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్‌-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

TDP: మహానాడు నిర్వహణపై సమావేశం
TDP leaders meeting in Gadekallu

విడపనకల్లు, మే 23(ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్‌-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహానాడు నిర్వహణకు కమిటీ లను ఏర్పాటు చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమలింగప్ప, శ్రీనివాసులు, సీతారాముడు, త్యాగరాజు, శ్రీనివాస్‌చౌదరి, సర్మాస్‌, కమ్మన్న, ఎం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

బెళుగుప్ప: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ జయంతిని పురస్క రించుకుని మండలంలో ఈ నెల 27,28 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించే మహానాడు వేడుకలను పండుగలా జరుపుకుందామని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహణపై శనివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.


మండలంలోని రెండు క్లస్టర్లకు సంబంధించి తగ్గుపర్తి, విరుపాపల్లిల్లో మహానాడు జరపాలని నిర్ణయించారు. సొంత ఖర్చులతో నిర్వహించేందుకు ముందుకొచ్చారు. నాయకులు పెద్ద తిప్ప య్య, తగ్గుపర్తి, రాధాకృష్ణ, మల్లికార్జున, విరుపాపల్లి రాధా కృష్ణ, సునీల్‌, తిమ్మప్ప, రాము, ప్రసాద్‌, కంచి రాముడు, నరసాపురం వెంకటేశులు, తిమ్మప్ప, ఓబులేష్‌, యర్రిస్వామి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కణేకల్లు: మండలంలోని మాల్యం క్లస్టర్‌లో మహానాడు నిర్వహణ కు టీడీపీ నాయకులు శనివారం స్థల పరిశీలన చేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ వన్నారెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జ్‌ మారుతి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే మహానాడును స్ర్కీన్ల ద్వారా చూపిచేందుకు కార్యకర్తలకు కావాల్సిన ఏర్పాట్ల గురించి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కళేకుర్తి సుదర్శన, ఎంపీటీసీ నరేంద్ర, షేక్‌ముజ్జు, శరభనగౌడ్‌, ప్రభాకర్‌, జయరాంచౌదరి, జలంధర్‌రెడ్డి, హరి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 12:16 AM