Share News

JCPR: చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తాం

ABN , Publish Date - May 24 , 2026 | 12:00 AM

బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యాపారా లు సాగిస్తున్న చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో తాడిపత్రి టౌనబ్యాంక్‌ ద్వారా రుణాలు ఇవ్వాలని సంకల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో చర్చించామన్నారు. ఆయన శనివారం పట్టణంలోని మార్కెట్‌యార్డు నుంచి బస్టాండ్‌ వరకు మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చిరువ్యాపారుల తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై వారికి అవగాహన కల్పించారు.

JCPR: చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తాం
JC Prabhakar Reddy is giving awareness to small traders

- మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్‌

తాడిపత్రి, మే 23(ఆంధ్రజ్యోతి): బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యాపారా లు సాగిస్తున్న చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో తాడిపత్రి టౌనబ్యాంక్‌ ద్వారా రుణాలు ఇవ్వాలని సంకల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో చర్చించామన్నారు. ఆయన శనివారం పట్టణంలోని మార్కెట్‌యార్డు నుంచి బస్టాండ్‌ వరకు మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చిరువ్యాపారుల తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మ్మెల్యే మాట్లాడుతూ... పట్టణంలోని చిరువ్యాపారులు సంతోషం గా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సహకారంతో ఒక్కొ క్కరికి రూ. పదివేల నుంచి రూ. 50వేల వరకు ఎలాంటి ఆస్తిపత్రాలు లేకుండా, కేవల ఒక నమ్మకమైన వ్యక్తి ష్యూరిటీ మీద వారి వారి వ్యాపారాన్ని బట్టి మంజూరుచేస్తామని తెలిపారు. టౌనబ్యాంకులో త క్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. అలాగే చిరు వ్యాపారులు ప్రతి రోజూ కొంత నగదు జమచేసుకోవచ్చని, ఆ నగదును మళ్లీ అవసర మైనప్పుడు బ్యాంకు తెరిచిన గంటలో తీసుకునే వెసులుబాటు కల్పిం చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన నాగరా గిణి, పవనకుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, మల్లికార్జున, పర్వీనరేష్మ, జింకా లక్ష్మీదేవి, షెక్షావలి, రంగనాథరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 12:01 AM