Home » GST
దేశంలో కొత్త జీఎస్టీ నిబంధనలు మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల అనేక ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా, వీటిపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీ స్లాబ్‌లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల్ని కాంగ్రెస్ నేత చిదంబరం స్వాగతించారు. 'కానీ చాలా ఆలస్యమైంది' అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాలు, బీహార్ ఎన్నికలు, వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'నెక్స్ట్-జెన్' జీఎస్టీ సంస్కరణలు..
జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అన్నారు.
వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్‌పై ఆంక్షలను ఎత్తేయాలని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.
అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది.