Share News

Chidambaram on GST: మంచిదే.. కానీ చాలా ఆలస్యమైంది.. జీఎస్టీ సంస్కరణలపై చిదంబరం

ABN , Publish Date - Sep 04 , 2025 | 07:28 AM

కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల్ని కాంగ్రెస్ నేత చిదంబరం స్వాగతించారు. 'కానీ చాలా ఆలస్యమైంది' అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాలు, బీహార్ ఎన్నికలు, వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం..

Chidambaram on GST: మంచిదే.. కానీ చాలా ఆలస్యమైంది.. జీఎస్టీ సంస్కరణలపై చిదంబరం
Chidambaram on GST

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కేంద్రం నిన్న(బుధవారం) ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణల్ని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ పి.చిదంబరం స్వాగతించారు. అదే సమయంలో 'కానీ చాలా ఆలస్యమైంది' అంటూ వ్యాఖ్యానించారు. లోపాలను సరిదిద్దడానికి కేంద్రానికి ఎందుకు 8 సంవత్సరాల కాలం పట్టిందని ఆయన నిలదీశారు. ఈ మేరకు X పోస్ట్‌లో చిదంబరం తన అభిప్రాయాలని వెలిబుచ్చారు.


ప్రస్తుత GST రూపకల్పనలో చాలా లోపాలున్నాయని ప్రతిపక్షాలు చాలా సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వచ్చాయని.. అయినా కేంద్రం వారి విన్నపాలను విస్మరించిందని చిదంబరం అన్నారు. వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు మంచిదని చెప్పిన చిదంబరం.. ఈ సంస్కరణలు తెచ్చేందుకు ఇంతకాలం ఎందుకు పట్టిందని మోదీ సర్కార్ ను ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే అకస్మాత్తుగా జీఎస్టీలో ఈ మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.


భారతీయ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు, ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేపట్టారని చిదంబరం అన్నారు. దేశంలో వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం వంటి అంశాలు కూడా కేంద్ర చర్యలకు కారణమని చిదంబరం వ్యాఖ్యానించారు.

అటు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కూడా ఈ అంశంపై స్పందించింది. GST రేటు తగ్గింపును ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి ద్వారా సాధించిన సామాన్య ప్రజల విజయమని పేర్కొంది. జీఎస్టీ విధానం చాలా క్రూరమైనది, ప్రజా వ్యతిరేకమైనదని ఎన్నో సందర్భాల్లో TMC అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించిన విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 09:25 AM