Share News

CM Chandrababu on GST: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:14 AM

జీఎస్టీ స్లాబ్‌లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..

CM Chandrababu on GST: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం
CM Chandrababu on GST

అమరావతి, సెప్టెంబరు 4: జీఎస్టీ స్లాబ్‌లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు.


ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకంగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు, ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అభినందనలు తెలియచేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.


పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతోపాటు ప్రతీ భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 01:20 PM